Parliament Monsoon Session 2021: ఎంపీపై సస్పెన్షన్‌ వేటు

23 Jul, 2021 11:00 IST|Sakshi

► రాజ్యసభ : టీఎంసీ ఎంపీ సంతనూసేన్ సస్పెండైనా సభలోనే ఉంటంతో.. ఆయన్ని బయటకు వెళ్లాలని రాజ్యసభ ఛైర్మన్ కోరారు. దీంతో గందరగోళం నెలకొంది.

► లోక్‌సభ : పెగాసస్‌ అంశంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ సోమవారానికి వాయిదా పడింది.

► లోక్‌సభ : ఏపీ విభజన చట్టం హామీల అమలుపై చర్చకు లోక్‌సభలో వైఎస్సార్‌ సీపీ నోటీసు ఇచ్చింది. లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి రూల్ 193 కింద చర్చకు నోటీసు ఇచ్చారు. వచ్చే వారం చర్చకు అనుమతిస్తామని స్పీకర్‌ తెలిపారు.

► రాజ్యసభ : టీఎంసీ ఎంపీ సంతనూ సేన్‌ను సస్పెండ్‌ చేస్తూ సభలో తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా ఐటీ మంత్రి వైష్ణవ్‌ మాట్లాడుతూ.. ‘‘ టీఎంసీ సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారు. బెంగాల్ హింసా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. టీఎంసీ నేతలు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’’ అని అన్నారు.

► పార్లమెంట్‌ను పెగాసస్ అంశం కుదిపేస్తోంది. లోక్‌సభలో పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, శివసేన, డీఎంకే ఎంపీల ధర్నా నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాలకోసమే పెగాసస్‌ తెచ్చారని, కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఆందోళన మధ్య లోక్‌ సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడింది.

 రాజ్యసభలో పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు వైఎస్సార్‌ సీపీ నోటీసు ఇచ్చింది. వైఎస్సార్‌ సీపీ ఎంపీ వేమిరెడ్డి రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఎంపీలపై వేటు వేయాలని, పార్టీ ఫిరాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నోటీసు ఇచ్చారు.

రాజ్యసభలో విప్ జారీ చేసిన బీజేపీ.. పార్టీ సభ్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

► పెగాసస్ అంశంపై చర్చకు కాంగ్రెస్ ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చింది. 

మరిన్ని వార్తలు