Parliament Monsoon Session 2021: లైవ్‌ అప్‌డేట్స్‌

27 Jul, 2021 10:52 IST|Sakshi

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పెగాసస్‌పై విచారణ కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చట్టసభలో నినాదాలు చేస్తూ అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు. దీంతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తాజాగా సోమవారం వెల్‌లోకి విపక్ష సభ్యులు దూసుకొచ్చారు. పెగాసస్‌ వ్యవహారంపై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్‌ రేపటికి వాయిదా వేశారు.

వాయిదా పడి పునఃప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు మళ్లీ మధ్యాహ్నం 2.45కు వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 2.45 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. పెగాసస్‌పై ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది.

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా
విపక్షాలు పెగాసస్‌పై ఉభయసభల్లో ఆందోళన చేపట్టాయి. పెగాసస్‌ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మ.12 గంటల వరకు.. లోక్‌సభ మ.2 గంటల వరకు వాయిదా పడ్డాయి.

రైతులకు మద్దతుగా రాహుల్ ట్రాక్టర్ ర్యాలీ
రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఐదో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగాసస్‌ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పెగాసస్‌పై ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగనున్నాయి. వైఎస్సార్‌ సీపీ లోక్‌సభలో పోలవరంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.


 

మరిన్ని వార్తలు