చర్చలు కోసమే చట్ట సభలు: వెంకయ్య

19 Aug, 2021 06:13 IST|Sakshi

బెంగళూరు: పార్లమెంట్, శాసన సభలు ఉన్నది చర్చలు, నిర్ణయాల కోసమే తప్ప గొడవలు, అంతరాయాల కోసం కాదని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.  ఆయన బుధవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడారు.ఇటీవల పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో చోటుచేసుకున్న అనుచిత పరిణామాలను వెంకయ్య ప్రస్తావించారు. ప్రజల చేత ఎన్నికైన నేతలు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ‘‘పార్లమెంట్‌లో ఇటీవల ఏం జరిగిందో మీరు చూశారు. సార్‌.. మీరు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి. రాజ్యసభలో మీరెందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు అని కొందరు యువతీ యువకులు అడిగారు. సభలో కొందరు ఎంపీల ప్రవర్తన వల్లే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని సమాధానమిచ్చినట్లు చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు