సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ సమావేశాలు?

13 Aug, 2020 18:01 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. సెప్టెంబర్‌ మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం లోక్‌సభ, సాయంత్రం రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు కోనసాగే అవకాశం ఉంది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలు జరగాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కరోనా విజృంభిస్తున్న తరుణంలో సమావేశాలను నియమాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యుల్‌ ఇంకా వెల్లడి కాలేదు. కరోనా సమయంలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండడంతో ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు