Live: పార్లమెంట్‌ సమావేశాలు నాలుగో రోజు అప్‌డేట్స్‌

21 Sep, 2023 22:19 IST|Sakshi

నాలుగో రోజు కొనసాగుతున్న పార్లమెంట్‌ స్పెషల్‌ సెషన్స్‌

రాజ్యసభకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు

బిల్లుకు మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ

రాజ్యసభ, శాసన మండలిలో వర్తింపజేయాలన్న విజయసాయిరెడ్డి

Updates..

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం​ లభించింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు అనుకూలంగా 171 మంది ఓట్లు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు.

చరిత్రాత్మకమైన ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాజ్యసభలో 10 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం​ ఓటింగ్‌ చేపట్టగా అనుకూలంగా 171 మంది ఓట్లు వేశారు. కాగా ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడమే తరువాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన వెంటనే చట్టంగా మారనుంది.

► డిజిటల్‌ డివైజ్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ

► మహిళా బిల్లుపై రాజ్యసభలో ప్రారంభమైన ఓటింగ్. 

► మహిళా బిల్లుపై రాజ్యసభలో చర్చ నడుస్తోంది. మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. 

► మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్య సభలో కేంద్రంలో నిప్పులు చెరిగారు తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయన్. బెంగాల్‌లో ఆర్ధిక, ఆరోగ్య, పరిశ్రమలు, వాణిజ్య, భూ సంబంధిత శాఖలను మహిళలకు కేటాయించారు. మరి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీయే ఒక్క రాష్ట్రంలోనైనా మహిళా అభ్యర్థిని సీఎంగా చేసిందా? అని ప్రశ్నించారు.  

►2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయలేకపోతే  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ ఎంపీ కపిల్‌ సిబల్‌ రాజ్యసభలో డిమాండ్‌ చేశారు.

మహిళా రిజర్వేషన్లపై చర్చలో ఆర్‌ కృష్ణయ్య
►మహిళా రిజర్వేషన్లపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ సాయంత్రం ఓటింగ్‌ జరగనుంది. 
 వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో పాల్గొన్న  ఎంపీ ఆర్ కృష్ణయ్య
►మహిళా రిజర్వేషన్లు ఓబీసీలకు సబ్ కోటా కేటాయించాలి 
►అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన  వాటా ఇవ్వాలి
►56 శాతం ఉన్న జనాభా ఉన్న బీసీలకు రాజకీయాలలో 15 శాతం మాత్రమే వాటా ఉంది
►బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేయాలి 
►బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి

చంద్రయాన్-3 సక్సెస్ పై లోక్‌సభలో చర్చ
►ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ పై లోక్‌సభలో చర్చ  జరిగింది.
►వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ లావు కృష్ణదేవరాయలు చర్చలో పాల్గొన్నారు
►ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రయాన్ లాంచ్ చేశారు 
►చంద్రయాన్-3 సక్సెస్ కావడం ఆనందంగా ఉంది 
►శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధన కోసం  కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయడం లేదు
►నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం నిధులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ విడుదల చేయలేదు

►రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుంది. రాజ్యసభ, శాసన మండలిలో కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలి అని అన్నారు.

► నూతన పార్లమెంట్‌ వద్దకు వెళ్లిన సినీ నటి తమన్నా భాటియా. 

► మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. బిల్లుకు మేము పూర్తి స్థాయిలో మద్దతిచ్చాం. కానీ, అది తక్షణమే అమలులోకి రావాల్సిన అవసరముంది. ఇది అమలులోకి వచ్చే ముందు నెరవేర్చాల్సిన రెండు షరతులు ముందుగా ఉన్నాయి. ఒకటి జనాభా గణన, డీలిమిటేషన్. ఎందుకంటే జనాభా ప్రకారం సీట్లను కేటాయించడం ప్రారంభిస్తే జనాభా నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. అది ఆమోదయోగ్యం కాదు. 

► మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్‌లో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజ్యసభలో కూడా బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకం ఉంది. 

► మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పార్లమెంట్‌ వద్ద ఎంపీ పీటీ ఉష మాట్లాడుతూ.. మహిళలకు ఇది నిజంగా అమృత్‌కాల్‌. ఇది మాకు ఎంతో గౌరవం. 

► మహిళా రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌.

► బీజేపీ ఎంపీ హేమా మాలిని మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి ఒక విజన్‌ ఉంది. మహిళా బిల్లు విషయంలో మోదీకి ధన్యవాదాలు. బిల్లు విషయంలో అంతకుముందు ఏం జరిగిందన్నది కాదు. ప్రధాని మోదీ బిల్లును తీసుకువచ్చి పాస్‌ చేశారు. 

►పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు భారతీయ మహిళల్లో ఉత్సాహం నింపింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాసవ్వడం చారిత్రక ఘట్టం. బిల్లు పాసయ్యేందుకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. 

► పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెడతామన్నారు. 

► రాజ్యసభలో మహిళా బిల్లుపై సీపీఐ ఎంపీ సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేసినా రాజ్యసభలో మాత్రం అందరూ మద్దతిస్తారు. కానీ విషయం ఏంటంటే, ప్రతి పక్షానికి ఒక్కో ఆలోచన ఉంటుంది. రాజ్యసభ, శాసనసభల్లో కూడా ఈ బిల్లు అమలు జరగాలని నేను చెప్పాలనుకుంటున్నాను. బిల్లులో పుదుచ్చేరి గురించి ఏమీ చెప్పలేదు, ఢిల్లీ గురించి, పుదుచ్చేరి గురించి కూడా ఉండాలి. బిల్లు ఎప్పుడు అమలులోకి వస్తుందనేది అతి పెద్ద విషయం. 2021లో జనాభా గణన జరగలేదు. దీంతో బిల్లుపై అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యం వారికి లేదు. ఎన్నికల కోసం బిల్లును ప్రవేశపెడుతున్నారు. కానీ, సీపీఐ ఎప్పుడూ రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తోంది.

► లోక్‌సభలో ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం లభించింది. భారీ మెజార్టీతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ అయ్యింది. 

► నేడు రాజ్యసభకు మహిళా రిజర్వేషన్ బిల్లు. 

► రాజ్యసభలో బిల్లును ప్రవేశపేటనున్న కేంద్ర ప్రభుత్వం. 

►మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరుగనుంది.

మరిన్ని వార్తలు