ట్విటర్‌కు మరోసారి నోటీసులు

15 Jun, 2021 11:28 IST|Sakshi

జూన్ 18  సాయంత్రం  ప్యానెల్‌ ముందు  హాజరు కావాలి

మహిళల భద్రతతోపాటు,ఫేక్‌ న్యూస్‌పై చర్యలపై వివరణ

ఐటీ నిబంధనలు పాటించకపోవడం ఇటీవల తుది నోటీసులు

సాక్షి,న్యూ ఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విటర్‌పై గురిపెట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 18న హాజరుకావాలని  ట్విటర్‌కు పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది.  కొత్త ఐటీ నిబంధనలు పాటించకపోవడంపై ట్విటర్‌పై  మరోసారి కేంద్రం ఆగ్రహం వ్యక్తం  చేసింది. ఈ మేరకు ఇటీవల తుది నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. పదే పదే నోటిసులిచ్చినా తగిన వివరణ ఇవ్వడంలో ట్విటర్‌ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) లోని సైబర్ లా గ్రూప్ కోఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి ట్విటర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా నోటీసులిచ్చింది. జూన్ 18, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది.  మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్‌న్యూస్‌  నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ  ఇవ్వాలని ఆదేశించింది. 

చదవండి :  కొత్త సీపాప్‌ మెషీన్‌: కరోనా బాధితులకు వరం?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు