ఫేస్‌బుక్‌, గూగుల్‌కు సమన్లు

28 Jun, 2021 13:11 IST|Sakshi

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స‌మ‌న్లు

త్వరలో యూట్యూబ్, ఇతర  ప్లాట్‌ఫాంలకు నోటీసులు 

సాక్షి,న్యూఢిల్లీ: పౌరుల హక్కుల పరిరక్షణ,ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగం నివారణపై దృష్టి పెట్టిన కేంద్రం సోషల్‌మీడియా సంస్థలకు మరోసారి  సమన్లు ఇచ్చింది. ఈ అంశాలపై చర్చించేందుకు ఫేస్‌బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకు ఐటీ పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘం స‌మ‌న్లు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ప్యానెల్  రేపు(జూన్ 29వ తేదీ) క‌మిటీ ముందు హాజ‌రుకావాల‌ని సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌ను ఆదేశించింది. 

ఆన్‌లైన్‌లో  మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో సహా, పౌరుల హ‌క్కుల‌ను ర‌క్షించ‌డం, ఆన్‌లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగం అంశంపై ఫేస్‌బుక్‌, గూగుల్ సంస్థ‌ల అభిప్రాయాలను కమిటీ సేకరించనుంది. రెండు సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేయాల‌ని క‌మిటీ త‌న ఆదేశాల్లో పేర్కొంది. ఇదే సమస్యలపై చర్చించేందుకు రానున్న రోజుల్లో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ప్రతినిధులకు కూడా నోటీసులివ్వనుంది. ఇప్పటికే ఇదే అంశంపై జూన్ 18వ తేదీన ట్విటర్‌ను స్టాయీ సంఘం ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. 

చదవండి కోవిషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్‌!  సీరం సీఈవో భరోసా
DRDO: 2-డీజీ డ్రగ్‌, కమర్షియల్‌ లాంచ్‌ 

మరిన్ని వార్తలు