ముంబైలో చిరు జల్లులు

14 Dec, 2020 11:56 IST|Sakshi

మేఘావృతమైన ఆకాశం..

ముంబై: దేశ ఆర్థిక రాజధానిని వరుణుడు కరుణించడం లేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ముంబైతో పాటు థానె, కళ్యాణ్‌, దోంబివాల వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. పొగమంచు కప్పేయడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. పరిసరాలు సరిగా కనిపించడం లేదు. ఈ సందర్భంగా ప్రాంతీయ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేఎస్‌ హోసాలికర్‌ మాట్లాడుతూ.. ‘ముంబై, థానె, నవీ ముంబై ప్రాంతాల్లో గడిచిన ఆరు గంటల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇక రానున్న మూడు, నాలుగు గంటల్లో ఈ ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది’ అని తెలిపారు.

ఇక మరో 24 గంటల పాటు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపారు. ఇక వాతావరణ శాఖ ప్రకారం మరో 48 గంటల పాటు ముంబై, పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతం అయి ఉంటుందని.. ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు పడి పోతుందని వెల్లడించింది. ముంబై వాతావరణ పరిస్థితులకు సంబంధించి పలువురు నెటిజన్లు ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. 

 

మరిన్ని వార్తలు