కార్యకర్తకు వడదెబ్బ: ప్రసంగం ఆపి వైద్యులను పంపిన ప్రధాని

3 Apr, 2021 17:55 IST|Sakshi

గుహవాటి: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అసోంలో పర్యటించారు. భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా పార్టీ కార్యకర్త ఒకరు వడదెబ్బ (డీహైడ్రేషన్‌)కు గురయ్యాడు. దీంతో సభా ప్రాంగణంలో కలకలం రేపింది. దీంతో ప్రధానమంత్రి ప్రసంగం ఆపేసి వెంటనే అతడి గురించి ఆరా తీశారు. వెంటనే తన వైద్య సిబ్బందిని పంపించి అతడికి వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కొద్దిసేపు పాటు నరేంద్ర మోదీ తన ప్రసంగం ఆపేసి కార్యకర్త వైద్యంపై ఆదేశాలు ఇచ్చారు. 

అసోంలోని బస్కా జిల్లా తముల్‌పూర్‌లో బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో జనాల్లో ఉన్న కార్యకర్త హరిచరణ్‌ దాస్‌ ఎండలకు తాళలేక వడదెబ్బ (డీహైడ్రేషన్‌) తగిలింది. దీంతో కార్యకర్త సొమ్మసిల్లి పడడంతో జనాల్లో కలకలం మొదలైంది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ వెంటనే ప్రసంగం ఆపేశారు. అనంతరం తన వైద్య బృందాన్ని అతడికి వైద్యం చేయాలని పంపించారు. వెంటనే ప్రధానమంత్రి వైద్య బృందం హరిచరణ్‌ దాస్‌ వద్దకు వెళ్లి వైద్యం అందించారు. అతడి ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగించారు. ప్రధానమంత్రి వెంట ఎప్పటికీ నలుగురితో కూడిన వైద్య బృందం వెంట ఉండే విషయం తెలిసిందే. నిరంతరం ఆ వైద్యులు ప్రధాని వెంట ఉంటారు.
 

మరిన్ని వార్తలు