క్వారంటైన్ సెంట‌ర్‌లో గ‌ర్భా డ్యాన్స్

20 Oct, 2020 21:38 IST|Sakshi

ముంబై : ద‌స‌రా శ‌ర‌న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ముఖ్యంగా ఉత్త‌ర భార‌త‌దేశంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగేవి. అయితే ఈసారి కోవిడ్ నేప‌థ్యంలో ఆ సంద‌డి కోలాహ‌ల‌మే లేదు. ఈ  నేప‌థ్యంలో కోవిడ్ సెంట‌ర్‌లో న‌ర్సుల‌తో పాటు రోగులు సైతం పీపీఈ కిట్లు ధ‌రించి గర్భా నృత్యం  చేసిన వీడియో ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ముంబై గోరేగావ్‌లోని నెస్కో కోవిడ్ సెంటర్ ఇందుకు వేదికైంది. సంప్ర‌దాయ నృత్యం దాండియాకు బ‌దులుగా ర‌క్త‌దాన శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం  విజ్ఞప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. న‌వ‌రాత్రి వేడుక‌ల‌కు అన్ని జాగ్ర‌త్త‌ల న‌డుమ కోవిడ్  బాధితులకు ద‌గ్గ‌ర చేస్తూ వారిలో ఉత్సాహాన్ని పెంపొందించేలా ఆసుప‌త్రి యాజ‌మాన్యం చ‌ర్య‌లు తీసుకుంది.

అంత‌కుముందు అస్సాంకు చెందిన డాక్టర్‌ అరూప్‌ సేనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్‌ ధరించి 'వార్‌' చిత్రంలోని ఘంగ్రూ పాటకు కాలుకదిపాడు. ఈ వీడియోను సహోద్యోగి అయిన డాక్టర్‌ ఫైజన్‌ అహ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో  కరోనా కాలంలో నెగిటివిటీని దరిచేరనీయకుండా.. మిగిలిన వారికీ ఆదర్శంగా ఉండటమే మంచిదని పలువురు కామెంట్‌ చేస్తున్నారు. (వైరల్‌: పీపీఈ కిట్‌లో డాక్టర్‌ అదిరిపోయే‌ స్టెప్పులు)


 

మరిన్ని వార్తలు