జడ్జీల జీపీఎఫ్‌ ఖాతాలు క్లోజ్‌ చేస్తారా?: సుప్రీంకోర్టు

22 Feb, 2023 07:20 IST|Sakshi

న్యూఢిల్లీ: తమ జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎఫ్‌) ఖాతాలను నిలిపివేశారని పేర్కొంటూ పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు దాఖలు చేసిన విజ్ఞప్తి పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

ఏడుగురు జడ్జీల జీపీఎఫ్‌ ఖాతాలను క్లోజ్‌ చేశారని వారి తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా విచారణ ప్రారంభించాలని కోరారు. న్యాయమూర్తుల జీపీఎఫ్‌ ఖాతాలను మూసేయడం ఏమిటని సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చదవండి  నా తండ్రిని రక్షణ శాఖ కార్యదర్శిగా... ఇందిర తొలగించారు

మరిన్ని వార్తలు