పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు తీపికబురు

24 Feb, 2021 20:40 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ఇటీవల టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ లేకుండా ఏ జాతీయ లేదా రాష్ట్ర రహదారిపై వాహనాలను అనుమతించడం లేదు. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించాల్సి వస్తే టోల్ ప్లాజా వద్ద రెట్టింపు జరిమానా వసూలు చేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫాస్టాగ్ లేని కారణంగా రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులలో వాహనదారులు పేర్కొన్నారు.

ఫాస్టాగ్ లేని వారి భాద ఈ విదంగా ఉంటే, ఫాస్టాగ్ తీసుకున్న వారి భాద మరో విదంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పలు బ్యాంకులు, మొబైల్ యాప్‌ల నుంచి ఫాస్టాగ్ కొనుగోలుచేయడానికి అవకాశం కల్పించింది. ఫాస్టాగ్ తీసుకున్నవారు టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖాతా నుంచి కట్ అయ్యినట్లు పిర్యాదు చేస్తున్నారు. ఇందులో పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. పేటీఎం తన ఫాస్టాగ్ యూజర్లకు శుభవార్త తెలిపింది. మీ ఫాస్టాగ్ ఖాతా నుంచి అకారణంగా లేదా ఎక్కువ డబ్బు కట్ అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాటిని తిరిగి చెల్లిస్తుంది అని పేర్కొంది. ఇప్పటికే 2.6 లక్షల (82 శాతం)కు పైగా వినియోగదారులకు కట్ అయిన నగదును వారికీ తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. టోల్ ప్లాజాల నుంచి వస్తున్న ఫిర్యాదులు సహా ఇతరుల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా తమ వినియోగదారులకు సహాయం అందించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ గుప్తా తెలిపారు.
 

చదవండి:

క్రిప్టోకరెన్సీపై ఆర్‌బీఐ గవర్నర్‌‌ కీలక వ్యాఖ్యలు!

ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

>
మరిన్ని వార్తలు