వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. రేషన్‌ బియ్యం నీటిపాలు

10 Jul, 2022 17:44 IST|Sakshi

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముసురు కారణంగా పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ విధించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు సైతం రెడ్‌, ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ విధించారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సైతం మూడు రోజులు పాటు సెలవులు ఇస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్​ జిల్లాలో ఓ లారీ వర్షపు నీటి వరదలో కొట్టుకుపోయింది. కాగా, రేషన్‌ బియ్యం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో టన్నుల సంఖ్యలో రేషన్​ బియ్యం నీటిపాలైంది. అయితే, లారీ డ్రైవర్.. వరద పరిస్థితిని సరిగా అంచనా వేయకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. వరద ఉద్ధృతికి ఆ లారీ నీటిలో కొట్టుకుపోయింది. అయితే, మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. 

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం.. మూడు రోజులు స్కూల్స్‌ బంద్‌

మరిన్ని వార్తలు