‘పెగాసస్ అంశంపై కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదు’

13 Sep, 2021 12:39 IST|Sakshi

న్యూఢిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ అంశంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ ప్రారంభం అయ్యింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా, పెగాసస్‌ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ఈ అంశంపై మరో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.

కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందా లేదా అన్నది అఫిడవిట్‌లో చర్చించే అంశం కాదు అని స్పష్టం చేసింది. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాటిని అఫిడవిట్లో పొందుపర్చాలని తాము అనుకోవడం లేదని కేంద్రం సుప్రీం కోర్టు ఎదుట తమ వాదనలను వినిపించింది. కాగా, దీనిపై స్పందించిన ధర్మాసనం దేశ భద్రత, శాంతి భద్రతల అంశాలలోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా డిఫెన్స్‌ తదితర విషయాలు అడగట్లేదని తెలిపింది. పెగాసస్‌ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని ధర్మాసనం కేంద్రానికి తెలిపింది.  

చదవండి: ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత​ బలగాలకు వ్యూహాత్మక శిక్షణ !

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు