హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి.. వీడియో వైరల్‌

27 Dec, 2022 09:47 IST|Sakshi

దిస్పూర్‌: అస్సాంలో ఓ చిరుత హడలెత్తించింది. గత 24 గంటలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అస్సాంలోని జోర్హాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఇనుప కంచె దాడి జనావాసాల్లోకి వచ్చిన చిరుత.. రెయిన్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివాసితులపై దాడి చేసింది. చిరుత వరుస దాడిలో 15 మంది గాయపడ్డారని జొర్హాట్ ఎస్పీ మోహ‌న్ లాల్ మీనా తెలిపారు. వీరిలో ముగ్గురు అటవీ అధికారులతో సహా మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

చిరుత పరుగెత్తుతున్న దృశ్యాలను అటవీ శాఖ సిబ్బంది వీడియో తీశారు. ఇందులో చిరుత క్యాంపస్‌ చుట్టూ తిరుగుతూ, ముళ్ల కంచెపై దూకుతూ కనిపిస్తోంది. జనాలపై మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న కారుపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జోర్హాట్‌ శివారల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడి నుంచే చిరుతపులి క్యాంపస్‌లోకి చొరబడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారులకు చిరుత చిక్కలేదు. చిరుతను పట్టుకుని బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, నివాసితులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.
చదవండి: Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి

మరిన్ని వార్తలు