బెంగళూరులో 106 భాషల ప్రజలు

5 Sep, 2021 10:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి: సిలికాన్‌ సిటీ బెంగళూరులో ఎన్ని భాషలు మాట్లాడేవారు నివసిస్తుండవచ్చు? దీనికి సమాధానం 20 లేదా 30 అనుకుంటున్నారా.. కాదు.. 106..! అని ఒక సర్వే తేల్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిల్లీకి చెందిన ఓ నిపుణుడు నిర్వహించిన పరిశోధనలో ఇది వెల్లడైంది. బెంగళూరులో 22 అధికార, 84 ఇతరత్రా భాషలు మాట్లాడే ప్రజలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇందులో 44.5% మంది కన్నడ మాట్లాడేవారు కాగా, 15% తమిళం, 14% తెలుగు, 12% ఉర్దూ, 3% మలయాళీలు, 6% మంది ఇతర భాషలు మాట్లాడే ప్రజలున్నారు.

చదవండి: ఐఫోన్‌తో కేక్‌ కట్‌ చేసి.. ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుకలు: వైరల్‌

మరిన్ని వార్తలు