హైదరాబాద్‌: డేటా చోరీ కేసులో కీలక పరిణామం.. సిట్‌కు బదిలీ

23 Mar, 2023 15:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ వ్యవహారంగా సైబరాబాద్‌ పోలీసులు భావిస్తున్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. ఐపీఎస్‌ అధికారి పర్యవేక్షణతో సిట్‌ దర్యాప్తు ముందుకు సాగనున్నట్లు తెలిపారాయన. ఇక కేసులో కీలకంగా ఉన్న జస్ట్‌ డయల్‌కు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారించనున్నట్లు తెలిపారు. 

దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్‌ పోలీసులు బయటపెట్టారు. సుమారు 16 కోట్ల 80 లక్షల మంది డేటా చోరీ జరిగిందని చెబుతోంది సైబరాబాద్‌ పోలీస్‌ విభాగం. మరో పది కోట్ల మంది డేటా కొట్టేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది.  

వక్తిగత వివరాలతో పాటు అంత్యంత గోప్యంగా ఉండాల్సిన వివరాలు, సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయని,  కేసులో లీడ్స్‌ ఉన్నాయని, ఎక్కడి నుంచి లీక్‌ అయ్యిందనే దర్యాప్తులో తేలాల్సి ఉందని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర చెబుతున్నారు. అలాగే.. ఆర్మీకి సంబంధించిన డేటా(సిబ్బంది పేర్లు, ర్యాంకులు, పోస్టింగ్‌ ఇతర వివరాలు) సైతం లీక్‌ అయ్యిందని చెప్పారాయన. సాధారణ పౌరుల నుంచి ఎవరైనా కానీ.. డేటా తీసుకున్నప్పుడు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంచాల్సిన బాధ్యత ఉందని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర చెబుతున్నారు.

మరిన్ని వార్తలు