జొమాటో డెలివరీ బాయ్‌కి చేదు అనుభవం.. కుక్క అక్కడ కరవడంతో బోరున ఏడ్చేశాడు

10 Sep, 2022 16:21 IST|Sakshi

అతనో డెలివరీ బాయ్‌.. జొమాటోలో ఫుడ్‌ డెలివరీ చేసేందుకు వెళ్లి అనుకోని ప్రమాదంలో పడ్డాడు. తన జాగ్రత్తలో తాను ఉన్నప్పటికీ ఓ కుక్క అతడి ప్రైవేటు భాగాలపై కరిచింది. దీంతో, డెలివరీ బాయ్‌ తీవ్రమైన బాధతో కన్నీరు పెట్టుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, కుక్క ఓనర్‌పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. 

వివరాల ప్రకారం, ముంబైలో జొమాటో డెలివరీ బాయ్‌ నరేంద్ర పెరియార్.. పన్వెల్‌ ప్రాంతంలోని ఇండియాబుల్స్‌ కాంప్లెక్స్‌కు వచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ను ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో లిఫ్ట్‌లో భవనంపైకి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో అటుగా వచ్చాడు. లిఫ్ట్‌ తెరిచే క్రమంలోనే కుక్క.. డెలివరీ బాయ్‌ను కరవబోయింది. వెంటనే తప్పించుకోవడంతో.. లిఫ్ట్‌లోని నుంచి బయటకు రాగానే డెలివరీ బాయ్‌ ప్రైవేటు భాగాలపై కుక్క కరిచింది. కాగా, నొప్పి ఉన్నప్పటికీ డెలివరీ బాయ్‌ చాకచక్యంగా హెల్మెట్ అడ్డుపెట్టుకొని లోపలికి వెళ్లి ఆర్డర్‌ ఇస్తాడు. 

అయితే, కుక్క దాడి చేస్తుంటే కంట్రోల్ చేయాల్సిన ఓనర్‌ ఏదో వింత చూస్తున్నట్టు వ్యవహరిస్తాడు.డెలివరీ బాయ్ నరేంద్ర.. కుక్క చేసిన గాయంతో తీవ్రరక్త స్రావం కావడంతో గట్టిగా అరిచాడు. వెంటనే సహాయం కోసం అరుస్తూ పార్కింగ్ స్థలానికి పరిగెత్తాడు. దీంతో, అపార్ట్‌మెంట్‌లోని కొందరు వ్యక్తులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు