Aadhaar-Voter ID Link: ఆధార్‌తో ఓటర్‌ ఐడీ లింక్‌.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

25 Jul, 2022 08:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌తో ఓటర్‌ గుర్తింపు కార్డును అనుసంధానం చేస్తూ కేంద్రం తెచ్చిన వివాదాస్పద చట్టంపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ప్రభుత్వం శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో 24 గంటల వ్యధిలోనే ఆమోదింపజేసుకున్న ఈ చట్టంలో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలున్నాయని పిటిషనర్‌ కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ప్రజల గోప్యత, సమానత్వపు హక్కులకు ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు ‘గుర్తింపు ప్రయోజనం కోసం‘ ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వ్యక్తుల ఆధార్‌ నంబర్‌ను కోరేందుకు అనుమతిస్తుంది. ఆధార్‌–ఓటర్‌ ఐడీ లింకింగ్‌ కారణంగా దేశ పౌరులు కాని వారికి కూడా ఓటు హక్కు లభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎన్నికల సంఘం ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి ఆధార్‌ను ఎలక్టోరల్‌ డేటాతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల జాబితాలో పేర్లు పునరుక్తం కాకుండా, తప్పులు దొర్లకుండా చేయడమే తమ ఉద్దేశమని పేర్కొంటోంది. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఆధార్, ఓటర్‌ ఐడీ లింకింగ్‌ ఐచ్ఛికం మాత్రమే తప్పనిసరి  కాదు.

ఇది కూడా చదవండి: పోలీసులుంది ప్రజలకు భద్రత కల్పించడానికి.. మోదీకి బ్యానర్లు కట్టడానికి కాదు

మరిన్ని వార్తలు