Petrol, diesel price today: కొనసాగుతు‍న్న పెట్రో సెగ

7 Jun, 2021 10:37 IST|Sakshi

ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన  పెట్రోలు ధర

గత  నెల రోజుల్లో పెట్రోలుపై 5, డీజిల్‌పై 6 రూపాయలు పెరిగిన ధర

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు  సోమవారం మరింత ఎగిసాయి.  ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో  సెంచరీ  మార్క్‌ దాటేసిన పెట్రోలు ధరలు రికార్డు స్తాయిల వద్ద వాహన దారుల గుండెల్లో గుబులు  రేపుతున్నాయి. తాజాగా  పెట్రోల్‌పై లీటరుకు 28 పైసలు, డీజిల్‌పై  27 పైసలు పెరిగినట్లు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. దీంతో  దేశ రాజధాని నగరం ఢిల్లీలో  పెట్రోలు ధర  రూ. 95.37 ,డీజిల్‌ ధర రూ.  86.28 పలుకుతోంది.  ఫలితంగా గడిచిన  నెల రోజుల్లో  పెట్రోలు 5 రూపాయలు, డీజిల్‌ 6  రూపాయలు పెరిగింది.

పలు నగరాల్లో  పెట్రోలు , డీజిల్‌ ధర  లీటరుకు 
ముంబైలో పెట్రోల్  రూ.101.52 , డీజిల్‌ రూ. 93.58 
చెన్నైలో పెట్రోల్  రూ. 96.71, డీజిల్‌ రూ. 90.92
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.95.28, డీజిల్ రూ.89.07
హైదరాబాదులో పెట్రోల్  రూ .99.06  డీజిల్‌  రూ. 93.99

ఆరు రాష్ట్రాల్లో  సెంచరీ
ఆదివారం పెట్రోల్‌ లీటరుకు 21 పైసలు, డీజిల్‌ 20 పైసలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లో పెట్రోల్‌ ధర రూ. 100 మార్కును దాటేసింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్‌లు ఉన్నాయి. మే 4 నుంచి ధరలు పెరగడం ఇది 21వ సారి కావడం గమనార్హం.  మొత్తంగా పెట్రోల్‌ ధర రూ. 4.97 పెరగ్గా, డీజిల్‌ ధర రూ. 5.55 పెరిగింది.

మరిన్ని వార్తలు