కరోనా వ్యాక్సిన్‌: ఫైజర్‌ కీలక నిర్ణయం

5 Feb, 2021 14:20 IST|Sakshi

 ఇండియాలో అత్యవసర వినియోగ దరఖాస్తును ఉపసంహరించుకున్న ఫైజర్ 

సాక్షి,న్యూఢిల్లీ: ఫార్మా మేజర్ ఫైజర్ సంచలన విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో తన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 3న  జరిగిన భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ఈ విషయాన్ని ప్రకటించింది. (షాకింగ్‌: కరోనాలో 4 వేల రకాలు)

భారత్‌లో అనుమతి కోసం అధికారులను సంప్రదించిన దాదాపు రెండు నెలల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో తన కోవిడ్ -19 వ్యాక్సిన్ రెగ్యులేటరీ ఆమోద దరఖాస్తును ఉపసంహరించుకోవాలని ఫైజర్ నిర్ణయించినట్లు అమెరికన్ డ్రగ్ దిగ్గజం శుక్రవారం తెలిపింది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ  సమావేశంలో రెగ్యులేటరీ వ్యాక్సిన్  అదనపు సమాచారాన్ని కోరడంతో ఫైజర్‌ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్ అతితక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత అదనపు సమాచారంతో ఇండియాలో అత్యవసర వినియోగ ఆమోదం  కోసం మరోసారి దరఖాస్తు చేస్తామని కంపెనీ ప్రతినిధి  తెలిపారు.  

మరిన్ని వార్తలు