మహిళా జర్నలిస్ట్‌ సాహసం..

14 Sep, 2020 11:25 IST|Sakshi
మహిళా జర్నలిస్ట్‌ని ప్రశంసిస్తున్న పోలీసుల

దొంగలను వెంబడించి.. పోలీసులకు అప్పగించింది

న్యూఢిల్లీ: మొబైల్‌ దొంగతనం చేయాడనికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ఓ మహిళా జర్నలిస్ట్‌ వీరోచితంగా వెంబడించి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దురదర్శన్‌లో పని చేస్తోన్న మహిళా జర్నలిస్ట్‌ శనివారం మధ్యాహ్నం దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌ వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్‌ మీద వచ్చి ఆమె చేతిలోని మొబైల్‌ని లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ సదరు మహిళ ధైర్యంగా వారిని వెంబడించడం ప్రారంభించింది.

ఆ కంగారులో నిందితుల వాహనం పోలీసు బారికేడ్లకు తగిలి కింద పడ్డారు. ఆటో డ్రైవర్‌ సాయంతో సదరు జర్నలిస్ట్‌ నిందితులిద్దరిని దగ్గర్లోని పోలీసులకు అప్పగించింది. విచారణలో నిందితులిద్దరు తుగ్లకాబాద్‌కు చెందిన వారిగా తెలిసింది. డ్రగ్స్‌కు‌ అలవాటు పడిన వీరు డబ్బు కోసం అప్పుడప్పుడు ఇలాంటి దొంగతనాలు చేస్తామని పోలీసులకు తెలిపారు. నిందితులిద్దరిని ధైర్యంగా వెంబడించి పోలీసులకు అప్పగించినందుకు గాను సదరు విలేకరిని అధికారులు అభినందించారు. (చదవండి: డబ్బులిస్తావా.. మ్యారేజ్‌ హాల్‌ తగలబెట్టనా?)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు