కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి!

29 Oct, 2021 21:06 IST|Sakshi

మనం డిస్కవరీ చానల్స్‌లో కొండచిలువ, అనకొండ లాంటి పాములు ఎలా జంతువులపై దాడి చేసి తినేస్తాయో చూసి ఉంటాం. అవి చూస్తే కాస్త రోమాలు నిక్కబొడుచుకుని వొళ్లు జలదరిస్తుంది. అచ్చం అలాంటి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. అసలు ఇంతకీ ఆ ఫోటోలో ఏం ఉందంటే ఒక కొండచిలువ ఒక నక్కను గొంతు పిసికి చంపుతుంది. అసలు ఏముంది ఇందులో ఇలాంటివి చాలేనే చూశాం అంటారా!.

(చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?)

అసలు విషయం ఇక్కడే ఉంది ఏంటంటే సీతాకోక చిలుక రెక్కలు విప్పుకుని కూర్చొని ఉండగా కొండచిలువ నక్కను గొంతు పిసికి చంపేసింది. అయితే అందులో సీతకోక చిలుక ఎక్కడ ఉందో చెప్పండి" అనే క్యాప్షన్‌ని జోడించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.దీంతో నెటిజన్లకు ఆ ఫోటోలో సీతాకోక చిలుక  ఎక్కడ ఉంది అంటూ ఆసక్తిగా వీక్షించడంతో అది కాస్త పెద్ద రసవత్తరమైన అంశంగా మారుతుంది. ఇంతకీ ఆ సీతకోక చిలుక కొండచిలువ తలపై ప్రశాంతంగా కూర్చోని ఉంటుంది. నిజానికి చాలా మంది నెటిజన్లు గుర్తించలేకపోతారు.

(చదవండి: ఈశ్వర్‌ అల్లా" అంటే ఇదేనేమో)

మరిన్ని వార్తలు