డ్రగ్‌ టెస్టులో ప్రముఖ విమానయాన సంస్థ పైలట్‌ ఫెయిల్‌

27 Aug, 2022 06:58 IST|Sakshi

న్యూఢిల్లీ: డ్రగ్‌ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్‌ను ఫ్లైట్‌ డ్యూటీ నుంచి తొలగించినట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్‌ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా నలుగురు పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు.

విమానయాన సిబ్బంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే మొదట డి–అడిక్షన్‌ సెంటర్‌కు పంపిస్తారు. రెండోసారి కూడా పరీక్షలో ఫెయిలైతే మూడేళ్లపాటు విధుల నుంచి సస్పెండ్‌ చేస్తారు. మూడోసారి సైతం ఫెయిలైతే లైసెన్స్‌ రద్దు చేస్తారు. 

మరిన్ని వార్తలు