పింగళి పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల

2 Aug, 2022 19:26 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: జాతీయ జెండా రూపకర్త, తెలుగు తేజం పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాల సందర్భగా.. ఢిల్లీలో ఘనంగా తిరంగా ఉత్సవ్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు ఈ కార్యక్రమంలో నివాళి అర్పించింది కేంద్రం.

ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పింగళి పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. అంతేకాదు.. హర్‌ఘర్‌ తిరంగా పాటను సైతం విడుదల చేశారు.

మరిన్ని వార్తలు