చిన్నారి హ్యాండ్‌ బ్యాగ్‌లో తూటా కలకలం

17 Aug, 2022 22:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): ఇజ్రాయేల్‌ పర్యాటనకు వెళ్లి బెంగళూరుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విశ్రాంత యూనియన్‌ అధికారి మనవరాలి హ్యాండ్‌ బ్యాగ్‌లో తుపాకీ తూటాలు ఉండడం కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన కృష్ణాదుబ్‌ (64) ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఇజ్రాయేల్‌ పర్యాటనకు వెళ్లి వచ్చారు.

పలు ప్రాంతాలు చూసి దుబాయ్‌ మార్గంగా ఆదివారం ఉదయం చెన్నైకి వచ్చారు. అనంతరం బెంగళూరు వెళ్లడానికి చెన్నై స్వదీశీ విమానాశ్రయానికి వచ్చారు. భద్రతా అధికారులు తనిఖీ చేయగా అందులో తుపాకీ తూటా ఒకటి కనిపించింది. ఆ తూటాను స్వాధీనం చేసుకుని కృష్ణ దుబ్‌ ప్రయాణాన్ని రద్దు చేసి, అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆ తుపాకీ తూటా పెద్ద తుపాకీ 9 ఎంఎం రకంలో ఉపయోగించేదని తెలిసింది. వారిని హెచ్చరించి వదిలేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

చదవండి: Ashwini Dutt: మహానటిలో జూనియర్‌ ఎన్టీఆర్‌ లేకపోవడానికి కారణం అదే..

మరిన్ని వార్తలు