భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్‌’ విద్యార్థుల పిటిషన్‌

13 Mar, 2022 09:18 IST|Sakshi

న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఆగిపోయిన తమ వైద్య విద్యను భారత్‌లో పూర్తి చేసేందుకు అనుమతించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు శనివారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరిగే అవకాశముంది. ‘‘ఉక్రెయిన్‌ నుంచి 20,000 మంది భారత వైద్య విద్యార్థులు తిరిగి వచ్చారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేనందున వారి చదువుపై అనిశ్చితి నెలకొంది’’ అని వారి తరఫున కేసు వేసిన ప్రవాసీ లీగల్‌ సెల్‌ పేర్కొంది. 

(చదవండి:  పార్శిల్‌లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు)

మరిన్ని వార్తలు