అసోంలో ప్రధాని మోదీ పర్యటన

7 Feb, 2021 15:19 IST|Sakshi

అసోం: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఎన్నికల జరిగే రాష్ట్రాలైన బెంగాల్, అసోం రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా సోనిత్‌పూర్‌ జిల్లా థెకియాజులిలోని ‘అసోం మాలా’ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అసోం మాలా కింద రూ.7,700 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు. దాంతోపాటు బిశ్వనాథ్‌, చరైడియోలోని రెండు వైద్య కళాశాలలకు ప్రధాని శంకుస్థాపన స్థాపన చేశారు. మెడికల్ కాలేజీలకు పునాదిరాయి వేసిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. త్వరలో గువాహటిలో ఎయిమ్స్ వైద్య కళాశాల నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి వైద్య కళాశాలల్లో విద్యార్థులకు అస్సామీలో బోధిస్తారని చెప్పారు.

"ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక వైద్య కళాశాల, ఒక సాంకేతిక కళాశాలలో మాతృభాషలో బోధించేలా చూడటం నా కల. ఎన్నికల తర్వాత మేము అధికారంలోకి వచ్చాక స్థానిక భాషల్లో బోధించడానికి వైద్య, సాంకేతిక కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు అసోం ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను" అని ఆయన అన్నారు. అలాగే, టీ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్ 2021లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అసోం పర్యటన అనంతరం బెంగాల్ హల్దియాలో నేటి సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన బయల్దేరి వెళ్లారు. 
(చదవండి: ఆకస్మిక వరద: 150 మంది గల్లంతు!)

మరిన్ని వార్తలు