ఠాగూర్‌ కోరుకున్నది ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’నే

25 Dec, 2020 04:44 IST|Sakshi

‘విశ్వ భారతి’ శతజయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన

శాంతినికేతన్‌: భారత్‌తోపాటు ప్రపంచం సాధికారత సాధిం చాలని గురుదేవుడు రవీం ద్రనాథ్‌ ఠాగూర్‌ ఆకాంక్షిం చారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ను ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు. విశ్వకవి రవీంద్రుడు స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని గురువారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ వర్సిటీ, అనంతరం కాలంలో విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం విశేషంగా కృషి చేసిందని ప్రధాని కొనియాడారు. కాగా, ఈ ఉత్సవాలకు తనను ఆహ్వానించలేదని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ పరిణామం కేంద్రం, టీఎంసీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేపింది.  

ఆ పేరులోనే ఉంది
గురుదేవుడు కలలుగన్న విశ్వ–భారతి రూపమే ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌. భారత్‌ అభివృద్ధి, తద్వారా ప్రపంచ పురోగతియే ప్రభుత్వ లక్ష్యం. దీనిద్వారా భారత్‌ సాధికారత, అభివృద్ధి.. అంతిమంగా ప్రపంచ అభివృద్ధి సాధ్యం’అని  అన్నారు. ‘జాతీయవాద భావనతోపాటు సర్వమానవ సౌభ్రాతృత్వం సాధించేందుకు ఠాగూర్‌ ఈ సంస్థను స్ధాపించారు. భారత్‌ను ప్రపంచానికి గల సంబంధం ‘విశ్వ భారతి’పేరులోనే ఉంది. భారత్‌లో ఉత్తమమైన వాటి నుంచి ప్రపంచం ప్రయోజనం పొందాలి అనేదే రవీంద్రుని  కల’ అని తెలిపారు. ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్‌ వాసులకు ఆరోగ్య బీమా వర్తింప జేసే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని శనివారం ప్రధాని  ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు