అభివృద్ధి డబుల్‌ రైల్‌ ఇంజన్‌లా పరిగెడుతోంది: మోదీ

23 Oct, 2020 12:07 IST|Sakshi

పట్నా: ప్రధాని నరేంద్రమోదీ ఎన్డీయే కూటమి తరపున బీహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం నాడు సాసరమ్‌లో జరిగిన తొలి ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం శరవేగంగా స్పందించి ప్రజలకు అండగా నిలిచింది. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించే ఉంటే అనూహ్యమైన కల్లోలం జరిగుండేది. అయితే నేడు బీహార్‌ ప్రజలు కోవిడ్‌పై పోరాడి, ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నారు. (ఉచితంగా కోవిడ్‌ టీకా)

2014 తర్వాత బిహార్‌లో అభివృద్ధి డబుల్‌ రైల్‌ ఇంజన్‌లా పరిగెడుతోంది. కరోనా కాలంలో పేదల  బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు వేశాం. ఈ మధ్య కాలంలో మరణించిన బీహార్‌ రాష్ట్రానికి చెందిన రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌కు నివాళులర్పించారు. గాల్వన్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పాదాభివందనం' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో కలిసి మొత్తం 12 సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243
పోలింగ్‌ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు  
అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7
ఓట్ల లెక్కింపు : నవంబర్‌ 10

మరిన్ని వార్తలు