మోదీ పుట్టిన రోజు.. శుభాకాంక్షల వెల్లువ

17 Sep, 2020 08:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అమిత్‌ షాతో సహా పలవురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్‌ వేదికగా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మోదీ తన జీవితంలో అనుక్షణం భారతదేశాన్ని బలంగా, సురక్షితంగా, స్వావలంబనగా మార్చడానికి అంకితం చేశారు. ఆయన నాయకత్వంలో దేశానికి సేవ చేయడం నా అదృష్టం. నేడు నేను దేశ ప్రజలందరితో కలిసి ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని అమిత్ షా హిందీలో ట్వీట్ చేశారు. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలుపుతూ, పేదలు, అట్టడుగున ఉన్నవారి సాధికారత కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని.. ఆయన నాయకత్వంలో దేశం ఎంతో ప్రయోజనం పొందిందని అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చురుకైన నాయకత్వం, దృఢ సంకల్పం, నిర్ణయాత్మక చర్యల వల్ల భారతదేశం ఎంతో ప్రయోజనం పొందింది. ఆయన పేదలు, అట్టడుగున ఉన్నవారికి సాధికారత ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. మోదీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్ చేశారు. (చదవండి: నిరంతర శ్రామికుడు మన ప్రధాని )

మోదీ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. - రాహుల్‌ గాంధీ

భారతదేశపు ప్రసిద్ధి చెందిన, ఎంతో దూరదృష్టి కల ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న దేశ ప్రజల సరసన నేను కూడా చేరాను. అపారమైన స్పష్టత కలిగిన స్థిరమైన నాయకుడు, తన సమగ్ర, స్థిరమైన అభివృద్ధి విధానాల ద్వారా భారతీయుల జీవితాల్లో పరివర్తన తీసుకువచ్చారు.- మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి

మా ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించినందుకు గాను ధన్యవాదాలు. మీ మచ్చలేని వ్యక్తిత్వం, అధిక నైతికత కారణంగా ఇది సాధ్యమయ్యింది. మీ నాయకత్వంలో కొత్త భారతదేశం పుట్టుకొస్తోంది. మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవ్వాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.- కిరణ్‌ రిజిజు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా