విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోండి: ప్రధాని మోదీ

7 May, 2022 13:37 IST|Sakshi

పుణె: విదేశీ వస్తువుల పట్ల మోజు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ బిజినెస్‌ మీట్‌నుద్దేశించి ఆయన శుక్రవారం వర్చువల్‌గా మాట్లాడారు. స్థానిక వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్వావలంబన దిశగా మనం సాగిపోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిభావంతులను, వాణిజ్యాన్ని, సాంకేతికతను సాధ్యమైనంత మేర ప్రోత్సహిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు