బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం.. ప్రధాని మోదీ సంతాపం

19 Sep, 2022 13:58 IST|Sakshi

ఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, ఒడిషా ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ‌(61) హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ  సోమవారం కన్నుమూసినట్లు సమాచారం. 

లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌, మెదడులో రక్తస్రావం గత రెండు నెలలుగా ఆయన  ఐసీయూలోనే ఉన్నట్లు ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. బిష్ణు చరణ్‌ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. ఒడిషా గవర్నర్‌ గణేషీ లాల్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌ సంతాపం తెలియజేశారు. 

బీజేపీ ఒడిషా విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు బిష్ణు చరణ్‌. టికెట్‌ మీద మొదటిసారిగా 2000 సంవత్సరంలో బిష్ణు చరణ్‌ గెలుపొందారు. భద్రక్‌ జిల్లా ధామ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి 2019లో గెలుపొందారు. ఒడిషా అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా ఆయన పనిచేశారు. 
 

మరిన్ని వార్తలు