దేశంలోనే తొలి ‘సోలార్‌’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన

9 Oct, 2022 19:19 IST|Sakshi

గాంధీనగర్‌: దేశంలోనే తొలి 24×7 సోలార్‌ విద్యుత్‌ గ్రామంగా గుజరాత్‌, మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొధేరాలో నిర్వహించిన బహిరంగ సభ వేదికా ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా.. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగానే మొధేరా దేశానికి తెలుసునని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్ని సౌర విద్యుత్తు గ్రామంగా గుర్తిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. 

‘సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని మరింత పోత్సహించడం ద్వారా ప్రపంచానికి ఇంధన ప్రదాతగా మారడమే లక్ష్యంగా పనిచేయాలి. మెహసానా ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్‌ కోసం ఎన్నో అవస్థలు పడ్డారు. మహిళలు నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. కానీ ఇప్పటితరానికి ఆ బాధల్లేవు. మంచి ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పరిశ్రమలను స్థాపించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, అనుసంధానతను పెంచడం వంటివి అందిస్తోంది.’ అని తెలిపారు మోదీ. గతంలో కరెంట్‌ సౌకర్యం లేకపోవడం వల్ల చదువు, ఇంటి పనులకు ఇబ్బందులు ఉండేవని.. ఇప్పుడు సౌర విద్యుత్‌ న్యూ ఇండియాను మరింత సాధికారత కల్పించేలా లక్ష్యాన్ని అధిగమించేలా చేస్తోందన్నారు. ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి నేడు గుజరాత్‌ కార్లు, మెట్రోకోచ్‌లను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్‌’ మంత్రి రాజీనామా

మరిన్ని వార్తలు