ఉల్లాసంగా చీతాలు: మోదీ

7 Nov, 2022 06:31 IST|Sakshi

న్యూఢిల్లీ: నమీబియా నుంచి తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో ఉంచిన 8 చీతాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని, కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నాయని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా గొప్పవార్త. నిర్బంధ క్వారంటైన్‌ తర్వాత కునో పార్కు వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా రెండు చీతాలను మాత్రం మరింత పెద్దదైన ఎన్‌క్లోజర్‌లోకి వదులుతామని అధికారులు చెప్పారు.

ఆ తర్వాత మిగతా వాటిని విడతలుగా వదులుతారు’అని మోదీ ఆదివారం ట్వీట్‌ చేశారు. రెండు చీతాలను శనివారం పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదులుతున్న వీడియోను ఆయన షేర్‌ చేశారు. పెద్ద ఎన్‌క్లోజర్‌ విస్తీర్ణం ఐదు చదరపు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెప్పారు. 30–66 నెలల వయస్సున్న 8 చీతాలను సెప్టెంబర్‌ 17న కునో నేషనల్‌ పార్కు క్వారంటైన్‌ జోన్‌లో ప్రధాని మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు