ఇండోనేషియా భూకంపం బాధాకరమన్న ప్రధాని మోదీ.. అండగా నిలుస్తామని హామీ

22 Nov, 2022 14:35 IST|Sakshi

న్యూఢిల్లీ: భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం ఇండోనేషియాలో భూకంపం దాటికి 150పైగా మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వందల మంది క్షతగాత్రులు కాగా, నష్టం ఊహించని స్థాయిలోనే చోటు చేసుకుంది. ఇక ఈ విపత్తుపై భారత ప్రధాని మోదీ మంగళవారం ట్విటర్‌ ద్వారా స్పందించారు.  

‘‘ఇండోనేషియాలో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరం. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుఃఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా నిలుస్తుంది’’ అని భారత ప్రధాని ట్వీట్‌ ద్వారా తెలిపారు.

ఇండోనేషియా జావా కేంద్రంగా రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో ప్రకంపనలు కుదిపేశాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించగా.. ప్రాణ నష్టం కూడా నమోదు అయ్యింది.

ఇదీ చదవండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం వసూలు

మరిన్ని వార్తలు