ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!

9 Apr, 2023 08:25 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం పర్యటన ముగిసే సమయానికి తిరు ఎస్‌ మణికందన్‌ అనే దివ్యాంగుడిని కలిశారు. అతనితో సమావేశమై ప్రత్యేక సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను 'ప్రత్యేక సెల్ఫీ' పేరుతో మోదీ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

అతను సొంతంగా దుకాణాన్ని నడపడమే గాక తన రోజువారి లాభాలలో గణనీయమైన భాగాన్ని బీజేపీకి ఇస్తాడని చెప్పారు. "ఆయన నేను ప్రారంభించిన రోడ్‌కు బూత్‌ ప్రెసిడెంట్‌గా, కార్యకర్తగా పనిచేయడం మాకెంతో గర్వకారణం. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో నేను కార్యకర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను.

అతని జీవితం స్ఫూర్తిదాయకం, అలాగే మా పార్టీ సిద్ధాంతాల పట్ల అతను కనబర్చిన నిబద్ధత కూడా ఆదర్శవంతంగా ఉంది . అతని భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు" అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మోదీ చెన్నైలో రూ. 5వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది ప్రభుత్వ పని సంస్కృతి, దార్శినికతల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు మోదీ. తమ ప్రభుత్వ డెడ్‌లైన్‌ కంటే ముందే ఫలితాలను సాధిస్తుందన్నారు.

తమ ప్రభుత్వం విజయాలను అందుకోవడంలో పని సంస్కృతి, విజన్‌ అనే రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ అంటే ఆలస్యం కానీ ఇప్పుడూ ఆ అర్థం డెలిరీ(తగిన సమయానికి అందించడం). తాము పన్ను చెల్లించే చెల్లింపుదారుల ప్రతి రూపాయికి తాము జవాబుదారిగా పనిచేస్తున్నాం. తాము నిర్థిష్ట గడువులతో పని చేస్తాం, వాటికంటే ముందే ఫలితాలను సాధిస్తాం అని మోదీ ఒక  బహిరంగ సభలో అన్నారు. 

(చదవండి: సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి)

మరిన్ని వార్తలు