‘దేశ ప్రజలకు అబ్దుల్‌కలాం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు’

15 Oct, 2021 10:53 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశం బలోపేతానికి అబ్దుల్‌కలాం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం 90వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ‘దేశాన్ని సమర్థవంతంగా మార్చేందుకు అబ్దుల్‌కలాం కృషి చేశారు. దేశ ప్రజలకు అబ్దుల్‌కలాం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు’ అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు