రామసేతు ఒడిలో మోదీ ప్రాణాయామం

21 Jan, 2024 13:52 IST|Sakshi

చెన్నై: రామసేతు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాయామం చేశారు. సముద్ర నీటితో ప్రార్థనలు చేశారు. తీరంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడులోని అరిచల్మునై జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోదీ.. రామసేతు నిర్మించిన ప్రదేశంగా పేరొందిన అరిచల్మునైకి వెళ్లారు.

రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాల మూడు రోజుల పర్యటనను ప్రధాని మోదీ తమిళనాడులో ముగించనున్నారు. శుక్రవారం  చెన్నైలో ఖేలో ఇండియా గేమ్స్ 2023ను ప్రారంభించారు. శనివారం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాలను సందర్శించారు. సోమవారం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడు ఆలయాలను మోదీ సందర్శించారు.

అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు దేశంలో దాదాపు 7000 మంది ప్రముఖులు హాజరవుతారు.  

ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..!

>
మరిన్ని వార్తలు