పేదలు, మధ్యతరగతి, రైతుల కలలు సాకారం చేసే బడ్జెట్:‍ మోదీ

1 Feb, 2023 15:02 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రబడ్జెట్‌ 2023-24పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రూపొందించిన బడ్జెట్ అని ప్రశంసించారు. 'అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు బలమైన పునాదులు వేస్తుంది. పేదలు, మధ్యతరగతి, రైతుల కలలు సాకారం చేసే బడ్జెట్ ఇది' అని మోదీ చెప్పారు.

దేశం కోసం సంప్రదాయబద్ధంగా తమ చేతులతో శ్రమిస్తున్న 'విశ్వకర్మ'లే ఈ దేశ సృష్టికర్తలని మోదీ వ్యాఖ్యానించారు. చరిత్రలో తొలిసారి కళాకారులకు శిక్షణ, మద్దతు కోసం ఓ పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు.

అలాగే దేశంలో మౌలిక సదుపాయాల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించడం వేగవంతమైన అభివృద్ధికి దోహదం చేస్తుందని మోదీ అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.
చదవండి: బడ్జెట్‌ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ

మరిన్ని వార్తలు