పెట్రో ధ‌ర‌ల త‌గ్గింపుపై ప్ర‌ధాని మోదీ రియాక్షన్‌ ఇది

21 May, 2022 21:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో చాలా కాలం త‌ర్వాత తొలిసారి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం శ‌నివారం సాయంత్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గిస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస ట్వీట్లు చేశారు. దీంతో పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 మేర తగ్గుతుందని ఆమె ప్ర‌క‌టించారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 

ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు తొలి ప్రాధాన్య‌మంటూ ఆయ‌న స‌ద‌రు ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. శ‌నివారం తీసుకున్న కీలక నిర్ణ‌యాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా త‌గ్గేలా తీసుకున్న నిర్ణ‌యంతో ప‌లు రంగాల‌కు సానుకూల ప్ర‌భావం ల‌భించ‌నుంద‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్ణ‌యంతో దేశ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట లభించ‌నుంద‌ని, వారి జీవితాల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు త‌న ట్వీట్‌కు నిర్మ‌లా సీతారామ‌న్ పెట్రో ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ చేసిన ట్వీట్‌ను ఆయ‌న జ‌త చేశారు.

మరిన్ని వార్తలు