వీడియో: గుజరాత్‌ భారీ రోడ్‌షో మధ్యలో ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్‌! ఎందుకంటే..

1 Dec, 2022 20:05 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. సరికొత్త ఫీట్‌ సాధించారు. దేశంలోనే అతిపెద్ద నగర రోడ్‌షో.. అదీ 50 కిలోమీటర్ల మేర చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో.. 

గురువారం సాయంత్రం అహ్మదాబాద్‌లో రోడ్‌షో జరుగుతుండగా.. ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దారిలో ఓ ఆంబులెన్స్‌ వస్తున్నది గమనించిన ప్రధాని సిబ్బంది.. ప్రధాని ఉన్న వాహనాన్ని పక్కకు ఆపించారు. ఆంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఆ సమయంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా అభిమానులు నిల్చున్నారు. వాళ్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రధాని మోదీ.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు