అయోధ్య రామునిపై పాట.. సింగర్‌ని అభినందించిన ప్రధాని మోదీ

7 Jan, 2024 19:54 IST|Sakshi

లక్నో: అయోధ్యలో మరికొద్ది రోజుల్లో రామ మందిర ప్రారంభోత్సవం ప్రారంభం కానుంది. ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాముడిపై భక్తితో పాటలను రూపొందిస్తున్నారు భక్తులు. రాముని గొప్పతనాన్ని కీర్తిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. వాటిలో తనకు నచ్చిన వాటిని ప్రధాని మోదీ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసి గాయకులను ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌కు చెందిన జానపద గాయని గీతా రబారీ పాటను ప్రధాని మోదీ షేర్ చేశారు. 

గుజరాత్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా రబారీ ‘శ్రీ రామ్‌ ఘర్‌ ఆయే’ పేరుతో ఆలపించిన గీతాన్ని ప్రధాని షేర్‌ చేస్తూ ఆమెను అభినందించారు. ‘‘అయోధ్యలో శ్రీరాముడి రాక కోసం ఎదురుచూపులు ముగిశాయి. దేశవ్యాప్తంగా రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. రాముడికి స్వాగతం పలుకుతూ గీతా రబారీ ఆలపించిన గీతం ఎంతో భావోద్వేగంగా ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: murli manohar joshi: ‘అయోధ్య’ ఉద్యమంలో మురళీ మనోహర్‌ జోషి పాత్ర ఏమిటి?

>
మరిన్ని వార్తలు