‘ఆక్సిజన్‌ సిలెండర్‌ లభ్యతపై భయాందోళనలు వద్దు’

16 Apr, 2021 16:43 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడికల్‌ ఆక్సిజన్‌ సిలెండర్ల అందుబాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం.. రాష్టాలకు సహయం చేయడానికి సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఆక్సిజన్‌ లభ్యతపై భయాందోళనలు అవసరంలేదని అన్నారు.

మెడికల్‌ ఆక్సిజన్‌లు గతంలో​ కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. కోవిడ్‌ కేసుల తీవ్రత అధికంగా ఉన్న మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ ఆయా రాష్ట్రలలో మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ అధికంగా ఉందని అన్నారు. ఆయా రాష్టాల మంత్రిత్వ శాఖల నుంచి, ఇంకా ఏమేరకు ఆక్సిజన్‌ అవసరమో సమాచారం సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే.. ఆక్సిజన్‌ను ఉత్పత్తిచేసే ఫ్లాంట్‌లను డిమాండ్‌కు తగ్గట్టుగా,  ఉత్పత్తిని కూడా పెంచాలని  ఆదేశించామని మోదీ తెలిపారు.  

పీఎం కేర్స్‌ నిధితో 100 ఆసుపత్రుల్లో సొంత ఆక్సిజన్‌ ఫ్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మరో 50 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతికి నిర్ణయంచామని అన్నారు. ఆక్సిజన్‌ ట్యాంకర్ల అంతరాష్ట్ర పర్మిట్‌ల నుంచి కేంద్రం మినహయింపు ఇచ్చిందని తెలిపారు. కేంద్రం, సిలెండర్‌ ఫిల్లింగ్‌ ఫ్లాంట్‌లకు అవరసరమైన భద్రతతో 24 గంటలు పనిచేయడానికి అనుమతి ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు