ఢిల్లీ నుంచే యూరప్‌లో ప్రధాని మోదీ కారు డ్రైవింగ్‌.. 5జీ సాయంతో..

1 Oct, 2022 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్‌లోని స్వీడన్‌లో కారు నడపటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. అది నిజమే. 5జీ టెక్నాలజీతో అది సాధ్యమైంది. ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2022’ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. దేశంలో 5జీ మొబైల్‌ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. 5జీ లింక్‌ సాయంతో ఇండియా మొబైల్‌ కాన్ఫరెన్స్‌లోని ఎరిక్సన్‌ బూత్‌ నుంచి యూరప్‌లో కారు టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. ఆ సమయంలో కారు స్వీడన్‌లో ఉంది. స్వీడన్‌లో ఉన్న కారును నియంత్రించే సాకేతికతను ఎరిక్సన్‌ బూత్‌లో అమర్చటం ద్వారా ఇది సాధ్యమైంది. 

రిమోట్‌ కంట్రోల్‌ కారు స్టీరింగ్‌ పట్టుకుని ఉన్న ప్రధాని మోదీ ఫోటోను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్లో షేర్‌ చేశారు. ‘భారత 5జీ టెక్నాలజీ సాయంతో ఢిల్లీ నుంచి యూరప్‌లోని కారును రిమోట్‌ కంట్రోల్స్‌ ఆధారంగా ప్రధాని మోదీజీ టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు.’ అని రాసుకొచ్చారు గోయల్‌. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్ 2022 కార్యక్రమం ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్‌ సాంకేతికత ప్లాట్‌ఫాం. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ప్రారంభమైన ఆరవ ఎడిషన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం అక్టోబర్‌ 4 వరకు జరగనుంది. రిమోట్‌ కంట్రోల్స్‌తో కారు నడపటంతో పాటు 5జీ సాంకేతికతతో అందుబాటులోకి వచ్చే వివిధ సౌకర్యాలను పరిశీలించారు మోదీ.

ఇదీ చదవండి: PM launch 5G services: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని

మరిన్ని వార్తలు