సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

17 Feb, 2022 10:33 IST|Sakshi
కేసీఆర్‌,ప్రధాని మోదీ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావుకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షుని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. 'మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. 


సీఎం కేసీఆర్‌కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు