జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

7 Jun, 2021 14:11 IST|Sakshi

వ్యాక్సిన్‌ పాలసీపై మాట్లాడనున్నట్లు సమాచారం

సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు పీఎంవో ట్వీట్‌ చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విమర్శలు వస్తుండటంతో మోదీ ముఖ్యంగా దీనిపై మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ అంశంలో తమ ప్రభుత్వ పాలసీని మోదీ మరోసారి ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. 

కోవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో దేశంలో వ్యాక్సిన్‌లకు తీవ్ర కొరత తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ప్రభుత్వం ‘‘వ్యాక్సిన్‌ మైత్రి’’ కార్యక్రామనికి కొంత కాలం పాటు విరామం ఇచ్చింది. దేశ ప్రజలందరికి సరిపడా వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఎక్కువ మొత్తంలో టీకాలను సేకరించడం ప్రాంరభించింది.

గత రెండు నెలలుగా దేశాన్ని వణికించిన కరోనా..  జూన్‌ నెల ప్రారంభం నుంచి కాస్త తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దేశంలో నేడు 1,00,636 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. త్వరలోనే థర్డ్‌వేవ్‌ విజృంభించనుందని హెచ్చరిస్తున్న నిపుణులు ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైరస్‌ కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాలు అన్‌లాక్‌ ప్రాసెస్‌ను ప్రారంభించాయి.

చదవండి: దేశంలో లక్షకు దిగొచ్చిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు