వైరస్‌పై నిర్లక్ష్యం వద్దు

21 Oct, 2020 03:46 IST|Sakshi
జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కరోనా ముప్పు ఇంకా తొలగలేదు

పండుగల సమయంలో జాగ్రత్తగా ఉండండి 

కరోనాపై పోరులో భారత్‌ ముందంజ

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌ ముగిసింది కానీ వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలిపారు. ఇది నిర్లక్ష్యంగా వ్యవహరించే సమయం కాదని, చిన్న పొరపాటు కూడా పండుగ ఆనందాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. అన్ని కోవిడ్‌–19 నిబంధనలు పాటిస్తూ పండుగలను జరుపుకోవాలని సూచించారు. దేశప్రజలనుద్దేశించి మంగళవారం ప్రధాని ప్రసంగించారు. కరోనా ముప్పు మొదలైన తరువాత దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఇది ఏడోసారి. అమెరికా, పలు యూరోప్‌ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గిన తరువాత.. అకస్మాత్తుగా ప్రమాదకర స్థాయిలో మళ్లీ పెరుగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కచి్చతమైన చికిత్స లభించేవరకు ఈ వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం కూడదని ప్రధాని అభ్యరి్థంచారు. కొందరు అత్యంత నిర్లక్ష్యంగా మాస్క్ ధరించకుండా, ఇతర జాగ్రత్తలు తీసుకోకుండా తిరగడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇది సరికాదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారు వారితో పాటు, అందరినీ ప్రమాదంలో నెడుతున్నార’న్నారు. మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని చేతులు జోడించి ప్రజలను అభ్యరి్థంచారు. ప్రజలు సుఖంగా, సంతోషంగా, సురక్షితంగా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. లాక్‌డౌన్‌ కాలం ముగిసిందని, ఆరి్థక కార్యకలాపాలు క్రమంగా జోరందుకుంటున్నాయని, పండుగలు వస్తుండటంతో ప్రజలు మార్కెట్లకు రావడం ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు. రానున్న దుర్గా పూజ, దీపావళి, ఛాత్‌ పూజ, మిలాద్‌ ఉన్‌ నబీ, గురు నానక్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. టీకా అందుబాటులోకి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

భారత్‌ సహా ప్రపంచదేశాలు టీకా తయారీకి కృషి చేస్తున్నాయన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే భారతీయులందరికీ దాన్ని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా, బ్రెజిల్, బ్రిటన్‌ వంటి వనరులు పుష్కలంగా ఉన్న దేశాలతో పోలిస్తే.. కరోనా మరణాలను కట్టడి చేయడంలో భారత్‌ ఎంతో సమర్ధవంతంగా పనిచేసిందన్నారు. అమెరికాలో 10 లక్షల జనాభాకు సుమారు 25 వేల కేసులు నమోదయ్యాయని, అదే భారత్‌లో 10 లక్షల జనాభాకు నమోదైన కేసుల సంఖ్య 5,500 మాత్రమేనని వివరించారు. అలాగే, అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్‌ తదితర దేశాల్లో 10 లక్షల జనాభాకు 600కు పైగా కరోనా మరణాలు సంభవించగా.. భారత్‌లో 10 లక్షల జనాభాకు కరోనా మరణాల సంఖ్య 83 మాత్రమేనని తెలిపారు. కోవిడ్‌–19 పేషెంట్ల కోసం భారత్‌లో 90 లక్షల బెడ్స్, 12 వేల క్వారంటైన్‌ కేంద్రాలు, 2 వేల ల్యాబ్స్‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలో భారత్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటుతుందన్నారు.

కబీర్‌.. తులసీదాస్‌ 
వ్యాధిపై విజయం సాధించేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ.. సంత్‌ కబీర్‌ రాసిన ఒక కవితా పంక్తిని, సంత్‌ తులసీదాస్‌ రాసిన రామచరిత మానస్‌ గ్రంథంలోని మరో పద్యాన్ని ప్రధాని తన  ప్రసంగంలో ప్రస్తావిం చారు. పొలంలో కోతకొచి్చన పంటను చూసి రైతు సంతోషంగా ఉంటాడని, కానీ, ఇంటికి వచ్చేవరకు ఆ పంట అతనిది కాదన్న విషయం అతనికి తెలిసి ఉండాలనే అర్థంలో కబీర్‌ రాసిన కవితా పంక్తిని మోదీ ప్రస్తావించారు. అలాగే, శత్రువును, వ్యాధిని, అగ్నిని, పాపాన్ని తక్కువగా అంచనా వేయకూడదని రావణుడికి ఆయన సోదరి శూర్పణఖ సలహా ఇవ్వడానికి సంబంధించిన తులసీదాస్‌ రాసిన ‘రామచరిత మానస్‌’లోని పద్యపాదాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా