పేదలను పట్టించుకోలేదు

6 Oct, 2021 04:10 IST|Sakshi

యూపీలో గత ఎస్‌పీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గత సమాజ్‌వాదీ(ఎస్‌పీ) సర్కార్‌ పేదలకు ఇళ్లు నిర్మించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. కేంద్ర ప్రాయోజిత గృహ నిర్మాణ పథకాల ఫలాలను పేదలకు అందకుండా అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వం మోకాలడ్డిందని మోదీ ఆరోపించారు. ‘ఆజాదీః 75 న్యూ అర్బర్‌ ఇండియా: ట్రాన్స్‌ఫార్మింగ్‌ అర్బన్‌ ల్యాండ్‌స్కేప్‌’ సదస్సు, ఎగ్జిబిషన్‌ను మంగళవారం లక్నోలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ గత ఎస్‌పీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

‘2017లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకం కింద ఏకంగా 18,000 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కానీ నాటి ఎస్‌పీ సర్కార్‌ కనీసం 18 ఇళ్లు కూడా నిర్మించలేదు.  కానీ కేంద్రంలోని మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీఎంఏవై కింద మూడు కోట్ల మంది పేదలను లక్షాధికారులను చేసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. 

అయోధ్యలో ఏడున్నర లక్షల వెలుగులు
పీఎంఏవై కింద లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ రెండు ప్రమిదలను దీపావళి రోజున వెలిగించాలని మోదీ సూచించారు. యూపీలో మొత్తం 9 లక్షల మంది లబ్దిదారులున్నారు. మరోవైపు, అయోధ్యలో దీపోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగాలో దీపావళి రోజున 7.5 లక్షల ప్రమిదలు కాంతులీననున్నాయి. 

మరిన్ని వార్తలు