రికార్డ్‌ స్థాయిలో పంటల ఉత్పత్తి పెరిగింది: ప్రధాని మోదీ

12 Jul, 2021 17:37 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ వేళ దేశంలో పంటల ఉత్పత్తి రికార్డ్‌ స్థాయిలో పెరిగిందని ప్రధానమంత్రి నరేం‍ద్ర మోదీ తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం  నాబార్డ్‌ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహారశుద్ధి రంగంలో విప్లవం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దేశ స్వయం సమృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవసరమని వ్యాఖ్యానించారు. గ్రామీణాభివృద్ధితోనే భారత స్వయం సమృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమీక్ష
రేపు( మంగళవారం) ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష  నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సీఎంలతో మోదీ మాట్లాడనున్నారు. ఇక మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపురలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా త్రిపురలో డెల్టాప్లస్‌ వేరియంట్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు